Aallu Arjun Next movie With Harish Shanker
పవన్
కళ్యాణ్ కి చాలా కాలం తరువాత సూపర్ హిట్ సినిమా ‘గబ్బర్ సింగ్ ’తీసి,
రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరీశ్ శంకర్ తో
సినిమా చేయడానికి యంగ్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నారనిపిస్తుంది.
ప్రస్తుతం ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా ’ సినిమాని శర
వేగంగా తెరకెక్కిస్తున్నాడు. ఇది ఈ మధ్యనే ప్రారంభించినా, ఈయన తరువాతి
ప్రాజెక్టును ఇప్పుడే ప్రకటించాడు. తన తరువాత సినిమా స్టైలిష్ స్టార్ అల్లు
అర్జున్ తో సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఎన్టీఆర్ తో
సినిమా తర్వాత బన్నీ సినిమాకు సంభందించిన స్క్రిప్ట్ పనులను మొదలు పెడతారని
సమాచారం. బన్నీకి స్టొరీ ఎప్పుడో వినిపించాడని, దీనికి ఎప్పుడో గ్రీన్
సిగ్నల్ కూడా వచ్చిందని అంటున్నారు. బన్నీ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో ’
సినిమా త్వరలో ప్రేక్షకుల మందుకు రానుంది. మరి కొన్ని రోజుల్లో సురేందర్
రెడ్డి దర్శకత్వంలో ‘రేసు గుర్రం ’ సినిమాలో షూటింగు ప్రారంభం కాబోతుంది.
దీని తరువాత వీరిద్దరి కాంబినేషన్ పట్టాలెక్కుతుందని అంటున్నారు.
No comments:
Post a Comment