ముద్దు సీన్ ఉంటేనే సినిమా చేస్తా? హీరోయిన్ ?
సినిమాకు డబ్బులు డిమాండ్ చేసే హీరోయిన్స్ చూశాం గానీ, ఇలా ప్రతి సినిమాకు ఒక ముద్దు సీన్, రొమాన్స్ ఉండాలని కండిషన్ పెడుతున్న హీరోయిన్ ఇప్పుడే చూస్తున్నాం. సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పి ఒక డైలాగు గుర్తుకు వస్తుంది. ‘‘నా దారి రహదారి ’’ అంటూ రజనీ చెప్పిన డైలాగు చాలా మంది సహజంగా వాడుతుంటారు. ఇప్పడు అలాగే ఒక కుర్ర హీరోయిన్ కూడా ‘‘నా దారి రహదారి ’’ కానీ అందులో తప్పని సరిగా ముద్దులు మాత్రం ఉండాలని. అంటే ఆమె నటించే ప్రతి సినిమాలో తప్పనిసరిగా ఒకటి , లేక రెండు ఎంగిలి ముద్దులు ఉండాలని డిమాండ్ చేస్తుంది. ఈ హీరోయిన్ చేస్తున్న డిమాండ్ నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆశ్చర్యపోతున్నారని ఫిలింనగర్ టాక్. ముద్దుంటేనే నటన, లేకపోతే రొమాన్స్ అంటూ షూటింగ్ గోల గోల చేస్తుంది ఈ చిన్నది. ముద్దు సీన్ ఉందంటే నేను నటిస్తా? ఆ లిప్ లాక్ సీన్ అంటేనే నేను పడిచస్తానని అంటుంది. రొమాన్స్ ఉంటే చాలు నేను లీనమైపోయి నటిస్తాను. అయిన మనం నటించేది నటనే కదా? రియల్ కాదు కాదా? అలాటప్పడు ఎందుకు ఇబ్బంది పడాలని అంటోంది హీరోయిన్ ప్రియా ఆనంద్. తను ఇప్పటి వరకు చేసిన రెండు సినిమాల్లో ముద్దులతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాల్లో కూడా ప్రియా ఆనంద్ కావాలని అడిగి మరీ ముద్దు సీన్లు పెట్టించుకున్నట్లు టాక్. ఏమైన ముద్దు కోసం ఇలా డిమాండ్ చేసే హీరోయిన్ పై తోటి హీరోయిన్లు జాలీగా చూస్తున్నారు.
No comments:
Post a Comment