ఒకటి
కాదు.. రెండు..కాదు..ఏకంగా మూడుసార్లు .. ప్రేమ విఫలమైతే ఎవరైన ఏం
చేస్తారు చెప్పండి? మనసులో పుట్టిన గాయాన్ని మాసిపోవాలంటే.. కొంచెం టైమ్
పడుతుంది. అదే ప్రేమను మరొకరికి పంచితే .. పాత సీసాలో ..కొత్త సారా
పడుతుంది. మళ్లీ ఆ మత్తు దిగే వరకు గమ్మత్తుగా ఉంటుంది. అలాంటి విషయమే
మలబార్ సుందరి నయనతార జీవితంలో జరిగింది. ఒకటి..కాదు..రెండు..కాదు
..ఏకంగా మూడు సార్లు ప్రేమలో పడి విఫలమైన హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.
ఇప్పుడు మరో కుర్రహీరోతో ప్రేమగీతాలు పాడుకుంటుంది. అయితే ఆ ప్రేమ గీతం
కూడా విషాదగీతం మారే అవకాశాలు ఉన్నాయాని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇప్పుడు నయనతార తన జీవితంలో మరిచిపోలేని ప్రేమగీతాలు ఎన్ని ఉన్నాయో మనకు
తెలియదు గానీ.. రీసెంట్ గా ఆమె ఒక విషాదగీతం పాటుకుంటుందనే టాక్ కోలీవుడ్
లో వినిపిస్తుంది. అదీ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు , హీరో
ధనుష్ ను చూసిన దగ్గర నుండి నయనలో ఈ విషాదగీతం మొదలైనట్లు తెలుస్తోంది.
అంటే హీరో ధనుష్ నిర్మాతగా మారి, ‘ఎదిర్ నీచ్చల్’ అనే
సినిమా నిర్మిస్తున్నారు. అందులో నయన తార చేత ఒక విషాదగీతంలో నయనకు
అవకాశం ఇవ్వటం జరిగింది. అయితే అందుకు నయన కాలు కదిపితే కావల్సినంత
పారితోషకం ఇవ్వాలని కండిషన్ పెట్టినట్లు సమాచారం. ఈ పాటలో దనుష్, నయన తార
ఇద్దరు కలిసి నటిస్తున్నారు. మామూలుగా కథానాయికగా నటించడానికి కోటి నుంచి
కోటిన్నర వరకు తీసుకుంటున్న నయనతార ఈ పాటకు కాలు కదపడానికి భారీ పారితోషికం
తీసుకోవటం జరిగిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నయనతార విషాదగీతంలో
నటిస్తున్న సమయంలో హీరో ఆర్య ఆమెకు తోడుగా వచ్చినట్లు కోలీవుడ్ సమాచారం.
అయితే ఈ విషాదగీతంలో నయన అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. ఆసమయంలో హీరో
శింబు, ప్రభుదేవాలతో కలిసి సాగిన జీవితం నయనతార కళ్లల్లో కనిపించిందని
కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏమైన నయన విషాదగీతం సినిమాకు హైలెట్ గా
నిలుస్తుందని సినిమా దర్శకులు చెబుతున్నారు.
No comments:
Post a Comment