టాలీవుడ్ తెరకు మెగాస్టార్ కొడుకుగా
ఎంట్రీ ఇచ్చి, అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను, ఫ్యాన్స్ ని, మార్కెట్
ని ఏర్పరుచుకొని, మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ దూసుకుపోతున్న ఇటు
టాలీవుడ్ లోనే కాకుండా, బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
అమితాబ్ బచ్చన్ ‘జంజీర్ ’ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న రామ్ చరణ్
సినిమా మార్కెట్ సినిమా సినిమాకి పెరుగుతుందని తాజాగా అమ్మడుపోయిన ‘జంజీర్,
తెలుగు వెర్షన్ ‘తుఫాన్ ’ రైట్స్ ని బట్టి తెలుస్తుంది. ఈ సినిమాని రెండు
భాషల్లో కలిపి అక్షరాల యాభైకోట్లకు అమ్ముడైయ్యానని సినిమా వర్గాల సమాచారం. ఈ
మధ్యనే విడుదల అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో దీని పై అంచనాలు
భారీగా పెరిగాయని అంటున్నారు.
రామ్ చరణ్ గత రెండు చిత్రాల రైట్స్ తో
పోలిస్తే ఈ సినిమా ‘జంజీర్ ’ ‘తుఫాన్' హక్కులు 50 కోట్లు, 10 కోట్లు ఎక్కువ పలికాయని అంటున్నారు. తెలుగు
వెర్షన్ ‘తుఫాన్' చిత్రాన్ని మొత్తం 1000కి పైగా థియేటర్లలో విడుదల
చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా హిందీ వెర్షన్‌ను 200
థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం జంజీర్/తుఫాన్
చిత్రం రామ్ చరణ్ కెరీర్లో ఓ సరికొత్త అధ్యాయానికి తెరతీయడం ఖాయంగా
కనిపిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్లు టాలీవుడ్
లో కూడా వంద కోట్లకు చేరువగా వెళతాయని విశ్లేషకులు అంటున్నారు.
No comments:
Post a Comment