Tuesday, 16 April 2013

Anjali To Team Up With Pawan Kalyan

Anjali got a bumper chance.png
 

అంజలికి బంపర్ ఆఫర్ 
 
తెలుగు ప్రేక్షకులకు సీతమ్మగా సుపరిచితం అయిన నటి అంజలి గత వారం రోజుల నుండి నిత్యం వార్తల్లో నిలుస్తూ హల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ కథ సుఖాంతం అయినట్లే. ఈ రోజు నుండి షూటింగులో పాల్గొంటానని చెప్పిన అంజలికి ఇక పై సినిమా అవకాశాలు రావడం కష్టమే అనుకున్నారు అంతా. 



కానీ ఈ కష్టకాలంలో అంజలికి అండగా నిలిచాడు పవన్ కళ్యాణ్. అదేనండీ ఆయన సినిమాలో ఈయనకు అవకాశం ఇచ్చాడని సమాచారం. త్వరలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ ’ సినిమాకు సీక్వెల్ తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మొదట కాజల్ కన్ ఫార్మ్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ చివరికి అంజలిని తీసుకున్నారని దీనికి సంబందించిన అధికారిక సమాచారం త్వరలో వెలువనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు.

No comments:

Post a Comment