జెనీలియా మళ్ళీ వస్తానంటుంది
కొందరు
సినిమా హీరోయిన్లకు పెళ్ళి చేసుకున్నా సినిమా మీద ఉన్న వ్యామోహం తగ్గదు. ఈ
రంగురంగుల ప్రపంచానికి అలవాటు పడ్డతరువాత అంత ఈజీ ఇండస్ట్రీని
వదిలిపెట్టడానికి ఇష్టపడరు. పోయిన సంవత్సరం పెళ్ళి చేసుకొని సంపార
జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ముంబయి భామ జెనీలియాకు కూడా సినిమాల పై మనస్సు
చావలేదు. దీంతో ఆమె మళ్ళీ సినిమాల్లోకి వస్తానంటోంది. ఇటీవల ఓ
కార్యక్రమానికి విచ్చేసిన ఆమె మాట్లాడుతూ...
సంసార జీవితాన్ని
అనుభవిస్తున్న ఏదో తెలియని లోటు ఉంది. అదే సినిమాల్లో నటించడంలేదనే బాధ.
అందుకే మళ్ళీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. తాను సినిమాలను
వదిలేయలేదని, ‘మా ఆయన నాకు పూర్తి స్వేచ్చనిచ్చాడు. నా మీద ఎటువంటి ఆంక్షలు
లేవు. కావాలనే సంవత్సరం పాటు నటనకు విరామం ఇచ్చాను. మళ్ళీ తెరమీదకు
త్వరలోనే వస్తాను. ఇప్పుడు అదే పనిలో వున్నాను. కథలు వింటున్నాను. మంచి కథ
దొరకగానే మళ్ళీ ముఖానికి రంగేసుకుంటాను" అంటోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ
అమ్మడుకు ఏ మాత్రం అవకాశాలు వస్తాయో చూడాలి.
No comments:
Post a Comment