Saturday, 27 April 2013

Venkatesh Imitate Jeevitha Rajasekhar

venkatesh-imitate.gif

  జీవిత రాజశేఖర్లకు వెంకటేష్ దెబ్బ
  
టాలీవుడ్ తెరపై కామెడీ పండించటానికి దర్శకులు.. చాలా కష్టపడతారు. కొంతమంది అయితే.. టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిడ్ ల మీద పంచ్ కామెడీ పుట్టించి.. ప్రేక్షకులను నవ్విస్తారు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యక్షరి అనే గ్రూప్ కామెడీ..ప్రేక్షకులను ఎంతగానో అలరించి, బుల్లితెర పై కూడా.. హల్ చల్ చేసింది. అప్పుట్లో ఈ గ్రూప్ కామెడీ పై .. టాలీవుడ్ లవ్ బర్డ్స్ ( నటుడు రాజశేఖర్- జీవిత) వార్ ప్రకటించించారు. కానీ టాలీవుడ్ లో వీరికి ఎలాంటి మద్దతు లేకపోవటంతో.. యుద్ద ఆభరణాలను సర్ధుకొని ..ఇంటికి వెళ్లిపోవటం జరిగింది. అసలే మెగా ఫ్యామిలీ. గతంలో ఫ్యామిలీ పై .. ఈ ప్రేమ పక్షలు.. విషరాగంతో పాటలు పాడి, అభిమానుల చేత ..రాళ్ళతో కొట్టించుకోవటం, ఆ తరువాత సారీలు చెప్పటం, వీరిపై ఒక నిర్మాత కేసు పెట్టడం, అన్ని జరిగాయి. అయిన ఈ లవ్ బర్డ్స్ మాత్రం తమ వైఖరి మార్చుకోలేదనే టాక్ టాలీవుడ్ లో ఉందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. అయితే ఈ సారి జీవిత రాజశేఖర్ల పై విక్టరీ వెంకటేష్ ‘షోడో ’ సినిమాలో పంచ్ కామెడీ పుట్టించినట్లు తెలుస్తోంది. అయితే గబ్బర్ సింగ్ సినిమా అంత పవర్ రాలేదని ప్రేక్షకులు అంటున్నారు. హీరో వెంకటేష్ కూడా జీవిత రాజశేఖర్లను ఇలా వాడుకోవటం పై టాలీవుడ్ లో కొత్త అనుమానాలకు దారితీస్తుందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. హీరోయిన్ తాప్సీ కూడా రాజశేఖర్ భార్య జీవిత పై.. పగ తీర్చుకున్నట్లు టాలీవుడ్. అసలు ఈలవ్ బర్డ్స్ అంటే టాలీవుడ్ వారికి అంత కక్ష? వీరు కూడా నటులే కదా? అసలు లోపం ఎవరిలో ఉంది? టాలీవుడ్ ప్రజల్లో ఉందా? లేక ఈ ఇద్దరిలోనే లోపం ఉందా? అంటే కచ్చితంగా జీవిత రాజశేఖర్లలోనే పెద్ద లోపం ఉందని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు

No comments:

Post a Comment