జూనియర్ ఎన్టీఆర్ భార్య కూడా నటిస్తుంది
ఈ
టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి. ఎన్టీఆర్ భార్య ఏంటి సినిమాల్లో నటించడం ఏంటి
అని అనుకోకండి. మీరు చదివింది నిజమే అంటున్నాయి టాలీవుడ్ చిత్ర వర్గాలు. జూనియర్ ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మి ప్రణతి తాజాగా హరీశ్ శంకర్
దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఓ చిన్న పాత్ర
పోషించబోతుందని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్.
విద్యార్థి సంఘ నాయకుడి పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో లక్ష్మి ప్రణతి ఓ
మెడికల్ కాలేజీ విద్యార్థినిగా కనిపించనుందట. అయిదు నిమిషాల పాటు ఆమె తెరపై
కనిపిస్తారనీ, అయితే సంభాషణలు ఏమీ ఉండవని తెలుస్తోంది. ఈమెను నటించమని
హరీశ్ శంకర్ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తే ఎన్టీఆర్ కష్టపడి ఒప్పించారని
అంటున్నారు.
అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో
తెలుసుకోవడానికి ఎక్వరీలు మొదలు పెట్టిన సినిమా జనాలకు ఒకటి మాత్రం అర్థం
అయిందట. ఎప్పుడు సినిమా ఆడియో ఫంక్షన్లకు వచ్చినా, ఇంత వరకు పెదవి విప్పని
లక్ష్మి ప్రణతి ఏకంగా వెండితెర పై కనిపించడానికి ఒప్పుకుందనే వార్త ఒట్టి
పుకారే అని కొట్టి పారేస్తున్నారు. ఇందులో ఏది నిజమో తేలాలంటే మరి
కొన్నాళ్ళు ఆగాల్సిందే. మరో ప్రక్క ఇదే సినిమాకు టైటిల్ ని ఖరారు చేయడానికి
దర్శకుడు ఓ ముహుర్తాన్ని కూడా నిర్ణయించాడట. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆ
పేరు ప్రకటించనున్నాడట. మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజున ఈ
సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారట. అంతే కాకుండా బోనస్ గా ఓ ట్రైలర్ ను
కూడా విడుదల చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేయనున్నాడట.
No comments:
Post a Comment