Parineeti Chopra Upset On Affair And Rumours
ఒక హీరోయిన్ అందరితో క్లోజ్ ఉంటే చాలు ..ఇక ఎఫైర్ ఉన్నట్లే లెక్క. ఇప్పటివరకు రణ్‌వీర్‌సింగ్, ఉదయ్‌చోప్రా, అర్జున్‌కపూర్, జాకీ భగ్నానీలతో నాకు ఎఫైర్ అంటగట్టారు. కొత్తగా దర్శకుడు మనీష్ శర్మ తో ప్రేమలో పడినట్లుగా చెబుతున్నారు. ఇంతమందితో నేను ఒక్కదాన్ని ఎలా చెయ్యగలను చెప్పండి అంటూ ప్రేమగా అడుగుతుంది బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. మేకప్ వేసుకోవడానికి సినిమాలు ఓ వంక అని, సులువుగా డబ్బు సంపాదించుకోవడానికి చాలామంది ఎంచుకొనే మార్గం అని, దూరప్రయాణాలు కూడా చేయొచ్చు కాబట్టి.. ఇష్టపడి సినిమాల్లోకి వస్తారని.. ఇలా నాకు సినిమా పరిశ్రమ మీద చాలా చిన్న చూపు ఉండేది’’ అంటున్నారు పరిణీతిచోప్రా. ‘ఇషక్‌జాదే ’తో కుర్రకారుకి కలల రాణి అయిపోయిన పరిణీతికి ఇప్పుడు సినిమాల మీద చిన్నచూపు కాదు పెద్ద చూపే ఉంది. యాక్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాతే, ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, కష్టపడనిదే డబ్బు రాదని తెలుసుకున్నానని అంటున్నారామె. సినిమా అంటే గౌరవం ఏర్పడిందని కూడా పేర్కొన్నారు ఈ బ్యూటీ.
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో బొద్దుగా ఉన్న పరిణీతి ఇప్పుడు సన్నబడే పనిలో పడ్డారు. దానికోసం తనకెంతో నచ్చిన పిజ్జాలకు దూరమయ్యానని, ఇంకా చాలా త్యాగాలు చేస్తున్నానని పరిణీతి తెలిపారు. ప్రస్తుతం మనీష్‌శర్మ దర్శకత్వంలో ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇక్కడే ఈ ఇద్దరి మద్య ప్రేమ చిగురించిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే పరిణీతి మాత్రం..‘ప్లీజ్.. ఎఫైర్ అని అనకండి? మా మద్య ఉన్నది స్నేహ బంధమేనని సిగ్గుపడుతూ చెబుతున్నట్లు బాలీవుడ్ బాబులు గుసగుసలాడుకుంటున్నారు.
No comments:
Post a Comment