విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శ్రుతి
హాసన్ వెండితెర తెరంగ్రేటం చేసి స్టార్ హీరోలతో నటించినా మొదట్లో ఆశించిన
విజయాలు దక్కక ఐరెన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. కానీ పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్
కావడంతో ఈ అమ్మడు స్టార్ తిరిగింది. ఆ సినిమా తరువాత నుండి ఈమెకు అవకాశాల
మీద అవకాశాలు వస్తున్నాయి. ఇటు తెలుగు, తమిళ్ లో వరుస అవకాశాలతో బిజీ అయిన
శ్రుతి హాసన్ తండ్రితో నటించడానికి నో చెప్పింది. ఇటీవల ‘విశ్వరూపం’ చిత్రం
భారీ విజయంతో అటు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ అయిన
కమల్‌హాసన్ త్వరలో ‘బిట్టెర్ చాకోలెట్’ అనే సినిమాకు ప్లాన్
చేస్తున్నారు. ఈ సినిమాలో కూతురును కూడా తీసుకోవాలని భావించిన ఆయనకు
ఊహించని అనుభవం ఎదురైంది. ఈ చిత్రంలో శృతిహాసన్‌తో కూడా నటింపచేయాలని
డిసైడ్ అయిన కమల్ ఆ విషయాన్ని శృతికి చెప్పాడు. అయితే ప్రస్తుతం తెలుగు,
తమిళం ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శృతిహాసన్ ఆ సినిమాలో నటించడం కుదరదని,
తన డేట్స్ ఖాళీలేవని వెల్లడించింది. దీంతో కమల్ ఖంగుతినాల్సి వచ్చింది.
చూద్దాం ఈ అమ్మడు హవా ఎన్ని రోజులు సాగుతుందో....?
No comments:
Post a Comment