తమన్నాకి న్యాయం చేస్తానంటున్న పూరీ
మిల్కీ
బ్యూటీ తమన్నాకి బాలీవుడ్ లో మరో అవకాశం దక్కిందా ? ఇప్పటికే తన డెబ్యూట్
మూవీ ‘హిమ్మత్ వాలా ’ సినిమా అట్టర్ ప్లాప్ అయిన తరువాత తమన్నా బాలీవుడ్ లో
చాప చుట్టేసినట్లే అని అందరు అనుకున్నారు. టాలీవుడ్ లో మంచి ఫాం లో ఉండగా
అక్కడికి వెళ్లి పెద్ద తప్పు చేసిందని కామెంట్లు కూడా వినిపించాయి. కానీ మన
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ మాత్రం తమన్నా ఆ సినిమాను ఎంచుకొని ఏ
తప్పు చేయలేదు. ఆ పాత్రకు తమన్నా కన్నా ఏ కథానాయిక కూడా ఎక్కువ న్యాయం
చేయలేదు.
ఆ సినిమా పరాజయంలో తమన్నా పాత్ర ఏ మాత్రం లేదని అంటున్నాడు. అంతే
కాకుండా తాను తీయబోయే హిందీ సినిమాలో కూడా తమన్నాకు అవకాశం ఇస్తానని
అంటున్నాడు. ఈయన త్వరలో హిందీలో రెండు సినిమాలు తీయబోతున్న విషయం
తెలిసిందే. ఇందులో తమన్నానే ప్రధాన కథానాయికగా తీసుకోబోతున్నాడట. మరి
తమన్నా పై పూరీ ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏమిటో ? మరి తమన్నా కూడా
పూరీకి ఏ న్యాయం చేసిందో ?
No comments:
Post a Comment