Actress Anjali Hrassed By Her Step Mother
నా శరీరం పై గాయాలకు వారే కారణం?
రామయాణంలో సీతమ్మకు కలిగిన కష్టం.. మరే ఏ మహిళలకు రాకూడదని కోరుకుంటారు. అయితే టాలీవుడ్ ‘సీతమ్మ’ కష్టాలు
మొదలైనాయి. హీరోయిన్ అంజలికి అమ్మగానీ అమ్మతో వేధింపులు, చిత్రహింసలు
పడుతుంది. తమిళ దర్శకుడు కళంజియమ్, అంజలికి అమ్మగానీ అమ్మ (పిన్ని)
భారతిలతో ప్రాణభయం ఉందని అంజలి మీడియాకు చెప్పటం జరిగింది. ఆ ఇద్దరు
కలిసి అంజలి సంపాదించే డబ్బులతో పుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంజలిని ఒక
ఏటిఎం మీషన్ మాదిరిగా వాడుకుంటున్నారని మీడియా ముందు వాపోయింది. డబ్బుల
కోసం .. ఓవర్ టైమ్ వర్క్ చెయ్యమని అంజలిపై ఒత్తిడి పెంచినట్లు
తెలుస్తోంది. 15 సంవత్సరాలుగా అంజలి కుటుంబంతో సంబంధం పెట్టుకున్న తమిళ
దర్శకుడు కళంజియమ్ మాట్లాడుతూ.. అంజలి చాలా చిన్నపిల్ల ఆమెకు ఏం
మాట్లాడుతుందో తెలియాదని చెబుతున్నారు. హీరోయిన్ అంజలి మాత్రం నా శరీరం
అయ్యే ప్రతి గాయానికి వారే కారణమాని చెబుతుంది. ‘మా పిన్ని భారతి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి గతంలో చెన్నైలో ఉన్నా. వారి కోసం ఎంతో చేశా. అయినా నాకు తెలియకుండా నా పేరుతో ఎన్నో మోసాలు చేశారు. ఇల్లు, షూటింగ్ మినహా బాహ్య ప్రపంచంతో నాకు సంబంధం లేకుండా చేశారు. మా అక్క, అన్నతోనూ
మాట్లాడనివ్వరు. వీరి ఆగడాలకు కళంజియమ్ అనే దర్శకుడు తోడ్పడుతున్నాడు.
వీరి వల్ల నాకు ప్రాణభయం ఏర్పడింది. నటిగా నేను సంపాదించిన కోట్లాది రూపాయల
ఆస్తిని వారు కాజేశారు. ప్రస్తుతం నావద్ద విలువైన ఆస్తి ఏమీ లేదు. నా
జీవనానికి ఇకపై సంపాదించుకోవాల్సి ఉంది. నేను మేజర్‌ను. నా కాళ్లపై
నిలబడదలచుకున్నా.
అందుకే
చెన్నై వదిలి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. హైదరాబాద్‌లో నేను ఎవరితోనో
సన్నిహితంగా ఉన్నాననే వదంతులకు అవకాశం ఇవ్వకూడదనే ఈ నిజాలు మీడియా ముందు
ఉంచుతున్నా’ అన్నారు.
ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నానని చెప్పారు. అయితే ఎవరి
మాటల్లో ఎంత నిజం ఉందో మాత్రం తెలియాదు. అసలు హీరోయిన్ అంజలికి ఆమె
పిన్నికి ఉన్న సంబందం ఏమిటి? అంజలి సొంత తల్లిదండ్రులు ఏమైయ్యారు.
హీరోయిన్ అంజలిపై తమిళ దర్శకుడు కళంజియమ్ పెత్తనం ఏమిటి? అంజలికి దర్శకుడు
కళంజియమ్ కు ఉన్న సంబంధం ఏమిటి? అంజలి పిన్నితో తమిళ దర్శకుడు
సన్నిహిత్యం ఏలా మొదలైంది. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న సంబంధాన్ని అంజలి
ఎందుకు తెంచుకుంటుంది? అసలు చెన్నై నుండి అంజలి హైదరాబాద్ రావటం వెనుక
ఉన్న టాప్ హీరో ఎవరు? అంజలికి ఆశ్రయం కల్పిస్తున్న ఆ యువ దర్శకుడు ఎవరు?
వారి గురించి అంజలి మీడియాకు చెప్పలేదు? అనే యాక్షప్రశ్నలు టాలీవుడ్
అభిమానులను వేధిస్తున్నాయి. అంజలి విషయం టాలీవుడ్ హాట్ టాఫిక్ గా మారింది.
టాలీవుడ్ సీతమ్మ కు జరుగుతున్న ఎఫిసోడ్ లో ఎన్ని మలుపులు తిరుగుతుందో
చూడాలి..
No comments:
Post a Comment