పరిశ్రమ కు వచ్చి దాదాపు 10 సంవత్సరాలు
పూర్తీ కావోస్తోన్నా, నయన తార డిమాండ్ మాత్రం రోజు రోజు కీ పెరిగిపోతోంది
... దీనికి తగ్గట్టు గానే ఈ అమ్మడు అటు పౌరాణిక పాత్రలు, ఇటు గ్లామర్
పాత్రలు కూడా చేస్తోంది ... 'సీత' గా నటించినా, 'గ్రీకు వీరుడి' హీరోయిన్
గా అవతారం ఎత్తినా , ఇటు తెలుగు అటు తమిళం లో నయన సెకెండ్ ఇన్నింగ్స్ హవా
కూడా జోరు గానే కోన సాగుతోంది ...
దీని తో పాటు ఈ అమ్మడు మళ్ళీ ప్రేమ లో
పడింది అనే వార్తా కూడా ... సింభు , ప్రభు దేవాల తో ప్రేమాయణం బెడసి
కొట్టిన తరువాత ఇక సినిమాల పైనే దృష్టి పెట్టాలి అనుకుని బుద్ధిగా సినిమాలు
చేసుకుంటున్న నయన్ కు తమిళ యువ హీరో ఆర్య రూపం లో ప్రేమ మళ్ళీ పలకరించింది
అని, ప్రస్తుతం కలసి నటిస్తోన్న వీరిరువురూ ప్రేమ లో పడ్డారు అని వార్త
... ఇంతకు మునుపు కూడా వీరు కలసి నటించిన, అప్పుడు నయన్ ప్రభు తో ప్రేమ లో
ఉండటం , ఇప్పుడు తన మనసుకు అయిన గాయానికి నయన్ ఆర్య ప్రేమ నే మందుగా ఎంచుకుంది
అంటున్నాయి చెన్నై వర్గాలు ... ఇందులో నిజం ఎంతో కాలమే చెప్పాలి
No comments:
Post a Comment