Saturday, 27 April 2013

Mamtha Mohandas Attacked By Cancer Again

Mamtha Mohandas Attacked By Cancer Again.png

  మమత పై మళ్లీ కేన్సర్ ఎటాక్ 
 
మళయాళ భామ మమతా మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు ఓ హీరోయిన్ గానే కాకుండా, మంచి సింగర్ కూడా సుపరిచితం. ఆకలేస్తే అన్నం పెడతా అంటూ అలరించిన ఈమె తరువాత పలు తెలుగు చిత్రాల్లో ఆడి, పాడిన విషయం తెలిసిందే. స్టాలీవుడ్ స్టార్ హీరోలైనా నాగార్జున, ఎన్టీఆర్ ల సరసన కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్న మమతాకి గత మూడు సంవత్సరాల క్రితం కేన్సర్ వ్యాధి ఉన్నట్లు తేలడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె వైద్యం చేయించుకోవడంతో సేఫ్ గా బయట పడింది. ఆ తరువాత తన చిన్నినాటి స్నేహితుడిని పెళ్లి చేసుకొని మూణ్ణాళ్ళకే విడాకులు ఇచ్చి, ఒంటరిగా జీవితం గడుపుతున్న ఆమెకు మరో సారి కేన్సర్ మహమ్మారి తిరగబడిందని తెలుస్తుంది. ఈ మధ్య ఆమె అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘తనకు మళ్ళీ ఓ మాయ రోగం వచ్చిందని, దానికి చికిత్స చేయించుకుంటున్నానని, త్వరలోనే మళ్లీ నేను పూర్తి ఆరోగ్యంగ వంతురాలిగా తయారవుతానని చెప్పింది. ఇక పెళ్లి పెటాకుల తరువాత రీఎంట్రీ ఇచ్చి ఓ ఊపు ఊపేద్దామని అనుకున్న మమతా కోరిక నెరవేరేట్లట్లు కనిపించడం లేదు. ఈ వ్యాధి కారణంగా చికిత్స కోసం ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని అంటున్నారు. మమతా తొందరగా కోలుకొని మళ్ళీ తన ఆట పాటలతో అలరించాలని కోరుకుందాం.


 
 

No comments:

Post a Comment