తెలుగు తెరకు ‘స్కూటర్’
హీరోయిన్ గా పరిచయం అవుతున్న ముంబై అమ్మాయి ప్రియాంకా చాబ్రా. అతడు ఆమె ఓ
స్కూటర్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం
అవుతుంది. వెన్నెల కిశోర్ హీరోగా ప్రియాంకా చాబ్రా హీరోయిన్ గా
వెండితెరపై రొమాన్స్ చేయబోతున్నారు. అయితే సినిమాల్లో రాకుముందు హీరోయిన్
ప్రియాంకా చాబ్రా తన అందాలను, తన నటనను, అద్దం ముందు నిలబడి అన్ని
చూసుకోని ఆనందపడిపోయేదట. వెన్నెల కిశోర్ నాలో ఉన్న అందాలను, నటనను
చూసి.. నన్ను హీరోయిన్ గా తీసుకోవటం జరిగిందని ప్రియాంక చెబుతుంది. అయితే
ఇప్పటి వరకు నా ప్రేమను ఎవరికి పంచలేదు. కానీ వెన్నెల కిశోర్ కు మాత్రం
... కొంచెం.. కొంచెం పంచుతూ వస్తున్నాను.
డైరెక్టర్
లక్ష్మణ్ కూడా నటన బాగా చెయ్యమని ప్రొత్సహించేవారు. అయితే నిర్మాత మాత్రం
నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా ఆదరించారని ప్రియాంకా చాబ్రా సిగ్గుపడుతూ
చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అందుకే టాలీవుడ్‌లోనే కొనసాగాలని
నిర్ణయించుకున్నానని స్కూటర్ హీరోయిన్ చెబుతుంది. ఇక నుండి నేను అద్దం
ముందు నిలబడి ఏమీ చూసుకోను. నిర్మాత సహయంతో..అన్ని నేర్చుకోని టాలీవుడ్
ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలనేది ముంబయి పోరి కోరికని చెబుతుంది. ముందు
వెన్నెల కిశోర్ కు కాసులు కురిపించు.. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల సంగతి
చూద్దాం అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే వెన్నెల కిశోర్ ను ‘జప్పా’ ను
చేశారు. మళ్లీ నీమీదేనే వెన్నెల కిశోర్ జీవితం ఆధారపడి ఉంది. ఆయన
జీవితంలో వెన్నెల కురిపిస్తావో..లేక కారుచీకటి నింపుతావో అంత నీ చేతుల్లో
ఉందని కొంచెం ఆలోంచి స్కూటర్ ను నడిపించమని సినీజనాలు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment