Tuesday, 30 April 2013

Reason Behind Nayanthara Love Story Break Up

nagarjuna-phone-calls.gif

 టాలీవుడ్ హీరోయిన్ నయన తార తన ప్రేమను డ్యాన్స్ మాష్టర్, నిర్మాత, నటుడు ప్రభుదేవాకు 100 పర్సెంట్ పంచింది. ప్రేభుదేవ నయన తార కోసం.. కట్టుకున్న భార్యకు 100 పర్సెంట్ విడాకులు ఇవ్వటం జరిగింది. ఈ ఇద్దరి ప్రేమ 100 పర్సెంట్ గా సాగుతున్న రోజుల్లో.. ఒక రోజు సాయంత్రం .. టాలీవుడ్ హీరో నుండి నయన కు ఫోన్. అప్పటి వరకు నయన ఇక సినిమాలకు టాటా చెప్పి వెళ్లిపోయింది. త్వరలో ప్రభుదేవాను పెళ్లిచేసుకోని హాయిగా 100 పర్సెంట్ తో కాపురం చెయ్యాలని ఎన్నో కలలు కన్నది. ఇలాంటి సందర్భలో.. నయన పై ప్రభుదేవా అంక్షాలు, ఒత్తిళ్లు, ఎక్కువుగా ఉన్నాయని అప్పట్లో కోలీవుడ్ వర్గాలు కోడై కూశాయి.  

 ప్రభుదేవాలోఉన్న ప్రేమ కాస్త .. 10 పర్సెంట్ కు పడిపోయింది. తాళి కట్టకముందే.. అనేక షరతులతో తాటతీస్తున్నాడు.. ఇక పెళ్లి జరిగితే నా పరిస్థితి ఏమిటి? అన్న ఆలోచనలు నయన తారను చంద్రముఖిలా అవరించాయి. దీనికి ఒక్కటే మార్గం ..బ్రేకప్. అసలు నయన ఆ నిర్ణయం తీసుకోవాటానికి కారణం ఏమిటి? ప్రభుదేవా నయన పై అంక్షాలు ఎందుకు పెట్టాడు? నయన పై ఉన్న అనుమానం ఏమిటి? అంటే ఒక్కటే కారణం చెబుతున్నారు తమిళ్ తంబీలు

టాలీవుడ్ హీరో నాగార్జున వల్లనే నయన, ప్రభుదేవాల ప్రేమ బ్రేకప్ అయ్యిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నారు. అప్పటికే నాగార్జునకు రెండు సినిమాల్లో చేదుఅనుభావం ఎదురైంది. మంచి హిట్ ఫేయర్ గా పేరుతెచ్చుకున్న నయన తార, నాగార్జున జంట మరోసారి వెండితెరపై కనిపిస్తే . మరో హిట్ తన ఖాతలో పడుతుందని భావించిన నాగార్జున ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోన్ చేసి తన మాటల్లో మధుర్యాన్ని రుచి చూపించినట్లు కోలీవుడ్ సమాచారం. ప్రతి రోజు అంక్షాలు పెట్టే ప్రేమ మొగుడు కంటే.. అభిమానంతో మాట్లాడే ‘‘గ్రీకువీరుడు ’’ మాటలు నయన మనస్సుటచ్ చేశాయి. అంతేకాకుండా రెండు మూడు సార్లు ‘టచ్ క్లబ్ ’ కలుసుకొని ప్రేమగా మాట్లాడుకోవటం జరిగిందని అప్పట్లో మీడియా వర్గాలు గోల చేశాయి. నాగార్జున టచ్ తో నయనకు లో ప్రభుదేవ ప్రేమ మైకం వదిలిపోయి, అతనికి బ్రేకప్ అనే బోర్డు పెట్టేసింది. ఆ విషయం ఎవరికి తెలియక ముందే నాగార్జునకు తెలిసిపోయిందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకున్నాయి. నాగార్జున వెంటనే అఫీషియల్ గా ఫోన్ చేసి.. నా సినిమాలో నటిస్తావా? అని నయన అడగటం .. ఆమె ఏమి తెలియానట్లు నటిస్తూ .. గ్రీకు వీరుడు ఒకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ విషయం తెలుసుకున్న ప్రభుదేవా టాలీవుడ్, కోలీవుడ్ లను వదిలిపెట్టి, బాలీవుడ్ కు పారిపోవటం జరిగిందని ఆయన అభిమానులు గుసగుసలాడుకున్నారు. సినిమాలకు దూరంగా వెళ్లిపోయిన సీతమ్మను . మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన ఘనత నాగార్జునదేనని ఫిలింనగర్ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇదే ఫ్లాన్ , ఇదే సూత్రం.. నాగార్జున బాలీవుడ్ హీరోయిన్ అయిన టాబు మీద ప్రయోగించి, ఆమెకు ఇప్పటివరకు పెళ్లికాకుండా చేశాడనే పుకార్లు ఫిలింనగర్లో షికారు చేస్తున్నాయి. ప్రేమ విషాదంతో మునిగిపోయిన నయన తారను ‘‘గ్రీకు వీరుడు ’’ ఓదార్పు పేరుతో మంచి రోమాన్స్ యాత్ర చేసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ రోమాన్స్ ను తెరపైకూడా పండించినట్లు గ్రీకువీరుడు చిత్ర యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. నటి టాబుకు నాగార్జున ఇళ్లు కట్టించినట్లే.. త్వరలో నయన తార కూడా ఒక ఇళ్లు కట్టిస్తాడనే పుకార్లు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి రొమాన్స్ చూడాలంటే.. ఈ శుక్రవారం వరకు ఆగాల్సిందే

Samantha Rejects Hindi Movie Offers

Samantha rejects Hindi movie offers.png

ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు సౌత్ లో ఫేమస్ అయిన తరువాత బాలీవుడ్ పై మోజు పెంచుకొని అక్కడికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లలో కొంత మంది రాణిస్తే, మరికొంత మంది అడ్రస్ లేకుండా పోయారు. కానీ వీరందరికి భిన్నంగా టాలీవుడ్ లో టాస్ రేసులో దూసుకుపోతున్న సమంతా బాలీవుడ్ ని తిరస్కరిస్తూ అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయం పై ఆమె స్పందిస్తూ.... అక్కడి నుండి పలు అవకాశాలు వచ్చిన మాట వాస్తవమే. కానీ నేను చేయనని ఖరాఖండిగా చెప్పేశాను.

 ప్రస్తుతం నేను తెలుగు స్టార్ హీరోల ప్రక్కన నటిస్తున్నాను. ఇక్కడి తెలుగు ప్రేక్షకులు నన్నే కోరుకుంటున్నారు. పైగా పారితోషికం కూడా బాగానే ఇస్తున్నారు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి నేను కష్టాలు పడలేను. నన్ను ఇంతగా ఆదరిస్తున్న దక్షిణాది ప్రేక్షకులకే నా మొదటి ప్రాధాన్యం. ఇప్పట్లో బాలీవుడ్ కి వెళ్ళే ఆలోచన లేదని, దానికి ఇంకా టైం ఉందని చెప్పుకొచ్చింది. మరి అవకాశాలు రాక అలా మాట్లడుతుందో లేక ఇక్కడి ప్రేక్షకులను బుట్టలో వేయడాని చెబుతుందో సినీ జనాలకు తెలియాలి అంటున్నారు.

Parineeti Chopra Upset On Affair And Rumours

Parineeti Chopra Upset On Affair And Rumours

parineeti-chopra.gif

ఒక హీరోయిన్ అందరితో క్లోజ్ ఉంటే చాలు ..ఇక ఎఫైర్ ఉన్నట్లే లెక్క. ఇప్పటివరకు రణ్‌వీర్‌సింగ్, ఉదయ్‌చోప్రా, అర్జున్‌కపూర్, జాకీ భగ్నానీలతో నాకు ఎఫైర్ అంటగట్టారు. కొత్తగా దర్శకుడు మనీష్ శర్మ తో ప్రేమలో పడినట్లుగా చెబుతున్నారు. ఇంతమందితో నేను ఒక్కదాన్ని ఎలా చెయ్యగలను చెప్పండి అంటూ ప్రేమగా అడుగుతుంది బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. మేకప్ వేసుకోవడానికి సినిమాలు ఓ వంక అని, సులువుగా డబ్బు సంపాదించుకోవడానికి చాలామంది ఎంచుకొనే మార్గం అని, దూరప్రయాణాలు కూడా చేయొచ్చు కాబట్టి.. ఇష్టపడి సినిమాల్లోకి వస్తారని.. ఇలా నాకు సినిమా పరిశ్రమ మీద చాలా చిన్న చూపు ఉండేది’’ అంటున్నారు పరిణీతిచోప్రా. ‘ఇషక్‌జాదే ’తో కుర్రకారుకి కలల రాణి అయిపోయిన పరిణీతికి ఇప్పుడు సినిమాల మీద చిన్నచూపు కాదు పెద్ద చూపే ఉంది. యాక్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాతే, ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, కష్టపడనిదే డబ్బు రాదని తెలుసుకున్నానని అంటున్నారామె. సినిమా అంటే గౌరవం ఏర్పడిందని కూడా పేర్కొన్నారు ఈ బ్యూటీ.  

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో బొద్దుగా ఉన్న పరిణీతి ఇప్పుడు సన్నబడే పనిలో పడ్డారు. దానికోసం తనకెంతో నచ్చిన పిజ్జాలకు దూరమయ్యానని, ఇంకా చాలా త్యాగాలు చేస్తున్నానని పరిణీతి తెలిపారు. ప్రస్తుతం మనీష్‌శర్మ దర్శకత్వంలో ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇక్కడే ఈ ఇద్దరి మద్య ప్రేమ చిగురించిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే పరిణీతి మాత్రం..‘ప్లీజ్.. ఎఫైర్ అని అనకండి? మా మద్య ఉన్నది స్నేహ బంధమేనని సిగ్గుపడుతూ చెబుతున్నట్లు బాలీవుడ్ బాబులు గుసగుసలాడుకుంటున్నారు

Aallu Arjun Next movie With Harish Shanker

Aallu Arjun Next movie With Harish Shanker

Allu Arjun Next With Harish.png

పవన్ కళ్యాణ్ కి చాలా కాలం తరువాత సూపర్ హిట్ సినిమా ‘గబ్బర్ సింగ్ ’తీసి, రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరీశ్ శంకర్ తో సినిమా చేయడానికి యంగ్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నారనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా ’ సినిమాని శర వేగంగా తెరకెక్కిస్తున్నాడు. ఇది ఈ మధ్యనే ప్రారంభించినా, ఈయన తరువాతి ప్రాజెక్టును ఇప్పుడే ప్రకటించాడు. తన తరువాత సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. 

ఎన్టీఆర్ తో సినిమా తర్వాత బన్నీ సినిమాకు సంభందించిన స్క్రిప్ట్ పనులను మొదలు పెడతారని సమాచారం. బన్నీకి స్టొరీ ఎప్పుడో వినిపించాడని, దీనికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని అంటున్నారు. బన్నీ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా త్వరలో ప్రేక్షకుల మందుకు రానుంది. మరి కొన్ని రోజుల్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘రేసు గుర్రం ’ సినిమాలో షూటింగు ప్రారంభం కాబోతుంది. దీని తరువాత వీరిద్దరి కాంబినేషన్ పట్టాలెక్కుతుందని అంటున్నారు.

Saturday, 27 April 2013

Mamtha Mohandas Attacked By Cancer Again

Mamtha Mohandas Attacked By Cancer Again.png

  మమత పై మళ్లీ కేన్సర్ ఎటాక్ 
 
మళయాళ భామ మమతా మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు ఓ హీరోయిన్ గానే కాకుండా, మంచి సింగర్ కూడా సుపరిచితం. ఆకలేస్తే అన్నం పెడతా అంటూ అలరించిన ఈమె తరువాత పలు తెలుగు చిత్రాల్లో ఆడి, పాడిన విషయం తెలిసిందే. స్టాలీవుడ్ స్టార్ హీరోలైనా నాగార్జున, ఎన్టీఆర్ ల సరసన కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్న మమతాకి గత మూడు సంవత్సరాల క్రితం కేన్సర్ వ్యాధి ఉన్నట్లు తేలడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె వైద్యం చేయించుకోవడంతో సేఫ్ గా బయట పడింది. ఆ తరువాత తన చిన్నినాటి స్నేహితుడిని పెళ్లి చేసుకొని మూణ్ణాళ్ళకే విడాకులు ఇచ్చి, ఒంటరిగా జీవితం గడుపుతున్న ఆమెకు మరో సారి కేన్సర్ మహమ్మారి తిరగబడిందని తెలుస్తుంది. ఈ మధ్య ఆమె అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘తనకు మళ్ళీ ఓ మాయ రోగం వచ్చిందని, దానికి చికిత్స చేయించుకుంటున్నానని, త్వరలోనే మళ్లీ నేను పూర్తి ఆరోగ్యంగ వంతురాలిగా తయారవుతానని చెప్పింది. ఇక పెళ్లి పెటాకుల తరువాత రీఎంట్రీ ఇచ్చి ఓ ఊపు ఊపేద్దామని అనుకున్న మమతా కోరిక నెరవేరేట్లట్లు కనిపించడం లేదు. ఈ వ్యాధి కారణంగా చికిత్స కోసం ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని అంటున్నారు. మమతా తొందరగా కోలుకొని మళ్ళీ తన ఆట పాటలతో అలరించాలని కోరుకుందాం.


 
 

Venkatesh Imitate Jeevitha Rajasekhar

venkatesh-imitate.gif

  జీవిత రాజశేఖర్లకు వెంకటేష్ దెబ్బ
  
టాలీవుడ్ తెరపై కామెడీ పండించటానికి దర్శకులు.. చాలా కష్టపడతారు. కొంతమంది అయితే.. టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిడ్ ల మీద పంచ్ కామెడీ పుట్టించి.. ప్రేక్షకులను నవ్విస్తారు. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యక్షరి అనే గ్రూప్ కామెడీ..ప్రేక్షకులను ఎంతగానో అలరించి, బుల్లితెర పై కూడా.. హల్ చల్ చేసింది. అప్పుట్లో ఈ గ్రూప్ కామెడీ పై .. టాలీవుడ్ లవ్ బర్డ్స్ ( నటుడు రాజశేఖర్- జీవిత) వార్ ప్రకటించించారు. కానీ టాలీవుడ్ లో వీరికి ఎలాంటి మద్దతు లేకపోవటంతో.. యుద్ద ఆభరణాలను సర్ధుకొని ..ఇంటికి వెళ్లిపోవటం జరిగింది. అసలే మెగా ఫ్యామిలీ. గతంలో ఫ్యామిలీ పై .. ఈ ప్రేమ పక్షలు.. విషరాగంతో పాటలు పాడి, అభిమానుల చేత ..రాళ్ళతో కొట్టించుకోవటం, ఆ తరువాత సారీలు చెప్పటం, వీరిపై ఒక నిర్మాత కేసు పెట్టడం, అన్ని జరిగాయి. అయిన ఈ లవ్ బర్డ్స్ మాత్రం తమ వైఖరి మార్చుకోలేదనే టాక్ టాలీవుడ్ లో ఉందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. అయితే ఈ సారి జీవిత రాజశేఖర్ల పై విక్టరీ వెంకటేష్ ‘షోడో ’ సినిమాలో పంచ్ కామెడీ పుట్టించినట్లు తెలుస్తోంది. అయితే గబ్బర్ సింగ్ సినిమా అంత పవర్ రాలేదని ప్రేక్షకులు అంటున్నారు. హీరో వెంకటేష్ కూడా జీవిత రాజశేఖర్లను ఇలా వాడుకోవటం పై టాలీవుడ్ లో కొత్త అనుమానాలకు దారితీస్తుందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. హీరోయిన్ తాప్సీ కూడా రాజశేఖర్ భార్య జీవిత పై.. పగ తీర్చుకున్నట్లు టాలీవుడ్. అసలు ఈలవ్ బర్డ్స్ అంటే టాలీవుడ్ వారికి అంత కక్ష? వీరు కూడా నటులే కదా? అసలు లోపం ఎవరిలో ఉంది? టాలీవుడ్ ప్రజల్లో ఉందా? లేక ఈ ఇద్దరిలోనే లోపం ఉందా? అంటే కచ్చితంగా జీవిత రాజశేఖర్లలోనే పెద్ద లోపం ఉందని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు

Tuesday, 23 April 2013

Sruthi Hassan In Bikini

Pawan heroine Sruthi in bikini.png

  బికినీలో భాగ్యలక్ష్మి అందాలు
విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు బాలీవుడ్ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యి తన అద్రుష్టాన్ని ‘లక్ ’ సినిమా ద్వారా పరీక్షించుకుంది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అన్ లక్కీ గాళ్ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత సౌత్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ మంచ అవకాశాలే పట్టి పెద్ద సినిమాల్లో నటించినా ఆశించినంత విజయం దక్కలేదు. కానీ పోయిన సంవత్సరం పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో నటించి మంచి హిట్ కొట్టిన తరువాత ఈమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు మూడు నాలుగు సినిమాల్లో, హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో నటిస్తున్న ఈ భామ ఇంత వరకు హోమ్లీ గా కనిపిస్తూ తన అందాలను తెర చాటునే ఉంచింది. కానీ ప్రస్తుతం రవితేజ సరసన నటిస్తున్న ‘బలుపు ’ సినిమాలో తన కత్తిలాంటి అందాలను మొహమాటం లేకుండా ఆరబోస్తుందట ఈ భాగ్యలక్ష్మి.  ఆ చిత్ర యూనిట్ వర్గాల సమాచారం పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాల ప్రదర్శన చేయడమే కాకుండా, ఒక సీన్లో భాగ్యలక్ష్మి బికినీ కూడా వేసిందని అంటున్నారు. మరి వారు అంటున్నట్లుగా ఏమాత్రం అందాలు ఆరబోసిందో, ఆ అందాలు ప్రేక్షకులకు విందు చేస్తాయో లేదో చూద్దాం.

Naga Chaitanya Tamanna Hot Stills From Thadaka

Tamanna Hot Stills from Thadaka.png

  తమ్మూ హాట్ హాట్ అందాల తడాఖా

మిల్కీ బ్యూటీ తమన్నా.... ఈమెను ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ అనే కంటే కాసుల కురిపించే అందాల బొమ్మ అనడం కరెక్టేమో. ఎందుకంటే ఈమెతో తీసే సినిమాలు అన్నీ కమర్షియల్ గానే ఉంటున్నాయి. అందులో ఆమె అందాలకు కాసుల వర్షం కురుస్తుంది. ఈ పాయింట్ ను క్యాచ్ చేసుకున్న సదరు దర్శక నిర్మాతలు ఈమెతో కావాల్సినంత ఎక్స్ పోజింగ్స్ చేయిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. గత రెండున్నర సంవత్సరాలలో ఈ అమ్మడు ఎక్స్ పోజింగ్ హెవీ రేంజ్ కి చేరింది. 


ఈ మధ్యనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నటించిన సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టినా, తమన్నా అందాలే కాసులు కరిపించాయంటే ఆమె అందాలకు ఏ రేంజ్ లో జనాలు ఫిదా అయ్యారో అర్థం అవుతుంది. తాజాగా ఈ అమ్మడు నాగ చైతన్య సరసన తమన్నా‘తడాఖా ’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో తమన్నా అందాలను పిచ్చ పిచ్చగా చూపిస్తున్నారట. బీచ్ సాంగులలో హాట్ గా చూపించడమే కాకుండా మ్యాక్సిమమ్ తొడలను చూపిస్తూ తెగ వాడుకుంటున్నారట. పై ఫోటోను చూస్తేనే అర్థం అవుతుంది తమ్మూ అందాలు ఏవింధగా ఆరబోసిందో.

Mohanbabu Satire On Mega Family



బాబు గారి సెటైర్లు ఎవరి మీదనో

టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ముక్కుసూటిగా మాట్లాడుతాడనే పేరుంది. ఎలాంటి వేదికైనా, ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనుకొని పరోక్షంగా సెటైర్లు వేస్తుంటాడు. అవి ఎవర్ని ఉద్దేశించి అంటాడనే విషయం ప్రక్కన పెడితే.... తాజాగా ఆయన టీఎస్సార్  అవార్డుల ఫంక్షన్ కి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలొకి వచ్చే యువ హీరోలు ఒక్క సినిమా హిట్టు అయితే చాలు. వారు సీఎం అయినంతగా ఫీలవుతున్నారని, అది సాంప్రదాయం కాదని ఆయన అన్నారు. సినీ ప్రస్థానం ప్రారంభించింది ఇప్పుడే అని, అందులో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని, విజయాల్ని, పరాజయాల్ని రెండింటిని సమానంగా స్వీకరించినప్పుడే హీరోగా ఎదుగుతాడని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంచి సినీ స్టార్ల కుటుంబం నుండి వెండితెరకు వస్తున్నారు. మరి ఎవర్ని ఉద్దేశించి అన్నాడో అన్నదాని పై చర్చ జరుగుతుంది.



ఆ చర్చలు సాగుతుండగానే ఈ రోజు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను మళ్లీ రాజకీయాలలోకి వస్తానని, అయితే ఏ పార్టీలో తాను చేరేది త్వరలో చెబుతానని, పార్టీ పెట్టే ధైర్యం లేదని, ఆ పార్టీ పెట్టి సంపాదించుకునే ధైర్యం కాని లేవని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. తనకు పదవులపై ఆసక్తి లేదనీ, తాను రాజకీయాల్లోకి వస్తే పదవులు ఆశించనని, ప్రచార బాధ్యతలు మాత్రమే చూస్తానని అన్నారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరని సుద్దులు చెప్పే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని అన్నారనే చర్చ సాగుతోంది. అయితే కొందరు మాత్రం మెగా ఫ్యామిలీని ఉద్దేశించే అన్నాడని,  చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేయడంపై మోహన్ బాబు సెటైర్ వేసి ఉంటారని అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో మోహన్ బాబు కు, చిరంజీవి కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు మళ్లీ ఎంత దుమారాన్ని రేపుతాయో చూడాలి.

Rajini Vikramsimha Rights For 30 Crores

Rajini Vikramsimha Rights For 30 Crores.png

  30 కోట్లు పలికిన రజినీ సినిమా 
 
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ కి అటు తమిళంలో ఎంత మార్కెట్ ఉందో, ఇటు తెలుగులో కూడా ఇంచు మించు అంతే మార్కెట్ ఉంది. ఆయన నటించిన సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో ’ తెలుగు హక్కులు భారీ రేటు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త ఏంటంటే... రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘కొచ్చాడయాన్ ’ తెలుగులో  ‘విక్రమసింహ ’ పేరుతో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. 

 విక్రమసింహసినిమా తెలుగు డబ్బింగ్ హక్కులు 30 కోట్లు పెట్టి ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుబ్రమహ్మణ్యం కొన్నారని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టాక్. గతంలో ఈయన  సుమారు 30 తమిళ, ఆంగ్ల చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి, లాభాలు గడించాడు. ఇప్పుడు ఈ సినిమాను ఇంత రేటు పెట్టి కొన్నాడు. అయితే ఎంత రజినీ సినిమా అయినా డబ్బింగ్ హక్కులను ఇంత భారీ రేటు పెట్టి కొనడం చాలా రిస్క్ అంటున్నారు తెలుగు సినిమా ట్రేడ్ పండితులు. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే.

Dhanush And Sonam Kapoor Hot Romance In Raanjhnaa


  రజనీకాంత్ అల్లుడిపై మనసుపడిన బాలీవుడ్ భామ?

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు హీరో దనుష్ పై బాలీవుడ్ భామ మనసుపడినట్లు తెలుస్తోంది. గతంలో దనుష్ కు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు శ్రుత్రి హాసన్ మద్య కెమిస్ట్రి జరిగినట్లు కోలీవుడ్ లో పుకార్లు పుట్టాయి. త్రీ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వీరి మద్య రొమాన్స్ నడుస్తుందని రుమార్లు పుట్టాయి. అయితే కొత్తగా బాలీవుడ్ భామ ధనుష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కొలవేరి కుర్రోడి పై సోనమ్ కపూర్ హాట్ కామెంట్ చేస్తుంది. రాంఝనాలో తనతోపాటు నటిస్తున్న తమిళ హీరో ధనుష్‌ను సోనమ్ కపూర్ ఆకాశానికి ఎత్తేసింది. తనకు ఏడేళ్ల నటనానుభవం ఉన్నా అతడి ముందుకు వచ్చాక కొత్తదానిని అనిపిస్తోందని చెబుతోంది. ఈ ప్రేమకథలో బెనారస్ నుంచి ఢిల్లీ జేఎన్‌యూకు చదువుకోవడానికి వచ్చే యువతి పాత్ర సోనమ్‌ది. ఆనంద్‌రాయ్ దర్శకుడు. ‘నాకంటే ఎంతో ముందుగానే ధనుష్ సినీపరిశ్రమలో ఉన్నాడు. అతనికి ఇది మొదటి హిందీ సినిమానే అయినా ధనుష్ బాలీవుడ్‌కు కొత్తవాడని నేను చెప్పలేను. మనకున్న అద్భుత నటుల్లో ధనుష్ ఒకడు. కచ్చితంగా నాకంటే మంచి నటుడు. అతనితో నటించేటప్పుడు నేను కొత్తదాన్ని అనిపించింది’ అని సోనమ్ తెలిపింది

  రాంఝనా జూన్ 28న విడుదలవుతోంది. తన అంతిమలక్ష్యం ఎప్పుడూ ఆనందమేనని చెప్పిన సోనమ్, భాగ్ మిల్ఖా భాగ్, ఖూబ్‌సూరత్ రీమేక్, యశ్‌రాజ్ ప్రొడక్షన్స్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఖూబ్‌సూరత్‌లో రేఖ పాత్రలో సోనమ్ కనిపిస్తుంది. అయితే అన్ని పాత్రలూ ఒకేసారి చేయడం కష్టమని, ఒకదాని షూటింగ్ ముగిశాకే మరోదాంట్లో నటిస్తున్నానని ఈమె తెలిపింది. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ఉన్న రేఖ పాత్రలో నటించే అవకాశం రావడం అద్భుతంగా ఉందని అనిల్ కపూర్ ముద్దుల కూతురు కూడా అయిన సోనమ్ చెప్పింది. ఇప్పటికే బాలీవుడ్ లో పాగావేసిన డ్యాన్స్ మాష్టర్, దర్శకుడు, కొరియోగ్రాఫి గా పేరు తెచ్చుకున్న నటుడు ప్రభుదేవా .. సోనాక్షితో నడిపిని రొమాన్స్ గురించి బాలీవుడ్ బాబు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అదే తరహాలో హీరో దనుష్ , సోనమ్ కపూర్ల విషయం ఉందని బాలీవుడ్ బాబులు అంటున్నారు

Telugu Wishesh Updates

Friday, 19 April 2013

Heroine Priya Anand Demand In Hot Kiss Scenes

heroine-priya-anand-demand.gif

  ముద్దు సీన్ ఉంటేనే సినిమా చేస్తా? హీరోయిన్ ? 
 
సినిమాకు డబ్బులు డిమాండ్ చేసే హీరోయిన్స్ చూశాం గానీ, ఇలా ప్రతి సినిమాకు ఒక ముద్దు సీన్, రొమాన్స్ ఉండాలని కండిషన్ పెడుతున్న హీరోయిన్ ఇప్పుడే చూస్తున్నాం. సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పి ఒక డైలాగు గుర్తుకు వస్తుంది. ‘‘నా దారి రహదారి ’’ అంటూ రజనీ చెప్పిన డైలాగు చాలా మంది సహజంగా వాడుతుంటారు. ఇప్పడు అలాగే ఒక కుర్ర హీరోయిన్ కూడా ‘‘నా దారి రహదారి ’’ కానీ అందులో తప్పని సరిగా ముద్దులు మాత్రం ఉండాలని. అంటే ఆమె నటించే ప్రతి సినిమాలో తప్పనిసరిగా ఒకటి , లేక రెండు ఎంగిలి ముద్దులు ఉండాలని డిమాండ్ చేస్తుంది. ఈ హీరోయిన్ చేస్తున్న డిమాండ్ నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆశ్చర్యపోతున్నారని ఫిలింనగర్ టాక్. ముద్దుంటేనే నటన, లేకపోతే రొమాన్స్ అంటూ షూటింగ్ గోల గోల చేస్తుంది ఈ చిన్నది. ముద్దు సీన్ ఉందంటే నేను నటిస్తా? ఆ లిప్ లాక్ సీన్ అంటేనే నేను పడిచస్తానని అంటుంది. రొమాన్స్ ఉంటే చాలు నేను లీనమైపోయి నటిస్తాను. అయిన మనం నటించేది నటనే కదా? రియల్ కాదు కాదా? అలాటప్పడు ఎందుకు ఇబ్బంది పడాలని అంటోంది హీరోయిన్ ప్రియా ఆనంద్. తను ఇప్పటి వరకు చేసిన రెండు సినిమాల్లో ముద్దులతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాల్లో కూడా ప్రియా ఆనంద్ కావాలని అడిగి మరీ ముద్దు సీన్లు పెట్టించుకున్నట్లు టాక్. ఏమైన ముద్దు కోసం ఇలా డిమాండ్ చేసే హీరోయిన్ పై తోటి హీరోయిన్లు జాలీగా చూస్తున్నారు

Archana Hopes On Panchami

archana hopes on Panchami.png

  అర్చన ఆశలన్నీ అందాల ఆరబోత పైనే

భానుడు తన ప్రతాపంతో జనాలకు వేడి పుట్టిస్తుంటే.... మరో ప్రక్క తన అందచందాలతో కుర్రకారుకు ఈ వేసవిలో మరింత వేడి పుట్టిస్తానంటుంది నటి అర్చన. అచ్చమైన తెలుగమ్మాయి అయిన వేద అర్చనగా తెలుగు తెరకు పరిచయం అయి బడా హీరోయిన్ గా వెలిగిపోదాం అనుకుంది. ఈ అమ్మడుకు బడా హీరోల ప్రక్కన మంచి అవకాశాలే వచ్చినా, అవి ఆఫర్లను తీసుకురాలేక పోయాయి. దీంతో గత కొన్ని రోజుల నుండి బొత్తిగా తెలుగు తెర పై కనిపించడం మానేసింది ఈ అమ్మడు. తెలుగు ఇండస్ట్రీ నుండి తమిళ ఇండస్ట్రీకి  మకాం మార్చి అవకాశాలు రాబట్టుకుంటున్న అర్చన ఇటీవల మత్తెక్కించే పాత్రలో తన అందాలను ఆరబోసిందట. ఈ అందాలకు ఫిదా అయిపోయిన ఓ తెలుగు దర్శకుడు ఈమెను హీరోయిన్ గా పెట్టి పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘పంచమి ’ లో అర్చన నటింపజేస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా స్టిల్స్ లో అర్చన ప్రేక్షకులకు హీటు పుట్టిస్తున్నాయి ఇంత వేసవి కాలంలో. ఈ సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులకు ఇంత వేసవి కాలంలో కూడా థియేటర్లో ఈమె అందాలకు వేడి పుట్టడం ఖాయం అంటున్నారు.
ఈమె కూడా ఈ సినిమాలో ఆరబోసిన అందాల పైనే ఆశలు పెట్టుకుందట. విరగకాసిన వెన్నెల లాగా అరబోసిన అందాలను చూసిన తెలుగు దర్శకులు ఈమెకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

Pawan Kalyan New Movie Title Attarintiki Daredi

Pawan Kalyan New Movie Title.png

  ‘అత్తారింటికి దారేది ’ అంటున్న పవన్ కళ్యాణ్

టాలీవుడ్ ప్రేక్షకులను వింత వింత సినిమా పేర్లతో అలరించే హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఈయన సినిమాల పేర్లు వింతగా, కొత్తగా ఉంటాయి. తాజాగా ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటి వరకు ‘సరదా ’, హరేరామ హరే క్రిష్ణ ’ అనే టైటిళ్ళు వినబడ్డాయి. కానీ ఇవేవి నిర్ణయం కాలేదు. తాజాగా ఫిలింనగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘అత్తారింటికి దారేది ’ అనే  వింత టైటిట్ ని పెట్టే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఈ టైటిల్ స్టోరీకి తగ్గట్లు ఉండటమే కాకుండా, పవన్ కి, త్రివిక్రమ్ కి బాగా నచ్చడంతో దీనినే ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట. సమంతా, ప్రణీత నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. 

Jr NTR Wife Pranathi Guest Role In Next Jr NTR Movie

Jr. NTR wife Pranathi Guest role in Next Movie.png
 
జూనియర్ ఎన్టీఆర్ భార్య కూడా నటిస్తుంది
ఈ టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి. ఎన్టీఆర్ భార్య ఏంటి సినిమాల్లో నటించడం ఏంటి అని అనుకోకండి. మీరు చదివింది నిజమే అంటున్నాయి టాలీవుడ్ చిత్ర వర్గాలు. జూనియర్ ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మి ప్రణతి తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించబోతుందని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్. విద్యార్థి సంఘ నాయకుడి పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో లక్ష్మి ప్రణతి ఓ మెడికల్ కాలేజీ విద్యార్థినిగా కనిపించనుందట. అయిదు నిమిషాల పాటు ఆమె తెరపై కనిపిస్తారనీ, అయితే సంభాషణలు ఏమీ ఉండవని తెలుస్తోంది. ఈమెను నటించమని హరీశ్ శంకర్ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తే ఎన్టీఆర్ కష్టపడి ఒప్పించారని అంటున్నారు. 

అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలుసుకోవడానికి ఎక్వరీలు మొదలు పెట్టిన సినిమా జనాలకు ఒకటి మాత్రం అర్థం అయిందట. ఎప్పుడు సినిమా ఆడియో ఫంక్షన్లకు వచ్చినా, ఇంత వరకు పెదవి విప్పని లక్ష్మి ప్రణతి ఏకంగా వెండితెర పై కనిపించడానికి ఒప్పుకుందనే వార్త ఒట్టి పుకారే అని కొట్టి పారేస్తున్నారు. ఇందులో ఏది నిజమో తేలాలంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే. మరో ప్రక్క ఇదే సినిమాకు టైటిల్ ని ఖరారు చేయడానికి దర్శకుడు ఓ ముహుర్తాన్ని కూడా నిర్ణయించాడట. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆ పేరు ప్రకటించనున్నాడట.  మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజున ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారట. అంతే కాకుండా బోనస్ గా ఓ ట్రైలర్ ను కూడా విడుదల చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేయనున్నాడట.

Telugu Movie Reviews






సినిమా రివ్యూలు 
 
 నితిన్ ‘ఇష్క్ ’ అనే ప్రేమకధా చిత్రం చేసి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన విజయంతో మళ్లీ అలాంటి కథనే ఎంచుకుకొని ‘గుండెజారి గల్లంతయిందే ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల గుండెల్ని ఏం చేసిందో తెలుసుకోవాలంటే కింద క్లిక్ చేయండి.

http://www.teluguwishesh.com/cinema/200-movie-film-reviews/44073-gunde-jaari-gallanthayyinde-telugu-movie-review.html 


అల్లు అరవింద్ మూడవ కుమారుడు అల్లు శిరీష్ కథానాయకుడిగా రాధామోహన్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాష్ రాజ్ నిర్మించిన చిత్రం గౌరవం
ఈరోజు విడుదలైంది. ఈ సినిమా రివ్యూ కోసం కింద క్లిక్ చేయండి.

http://www.andhrawishesh.com/home/movie-film-reviews/39326:gouravam-review.html

Allu Arjun To Romance Kaajal Vashisht


  జులాయి ముచ్చటగా మూడో అమ్మాయితో హాట్ రొమాన్స్

ఇప్పటికే జులాయి ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ముద్దు గుమ్మలే, కాకుండా మూడో భామతో రొమాన్స్ కు సిద్దమయ్యాడు జులాయి. 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో ముచ్చటగా మూడో అమ్మాయి ప్రవేశించింది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బండ్ల గణష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టైటిల్‌కు అనుగుణంగా అమలాపాల్‌, కేథరిన్‌ నాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే బ్యాంకాక్‌, స్పెయిన్‌ వంటి లొకేషన్లలో భారీ షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో మూడవ హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామ కాజల్‌ వశిష్ట్‌ నటిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కథానుసారమే మూడవ నాయికను కూడా తీసుకున్నారట. ఇంతవరకు ఈ విషయాన్ని ఫోకస్‌ చేయకపోయినప్పటికీ, అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే ఆమెకు సంబంధించిన కొంత చిత్రీకరణను జరిపారని అంటున్నారు. ప్రభుదేవా హిందీ చిత్రం 'రౌడీ రాథోడ్‌'లో నటించిన ఆమెకు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఎందరో ఉత్తరాది భామల కోవలో తాను కూడా టాలీవుడ్‌లో బిజీకావాలని కాజల్‌ వశిష్ట్‌ కోరుకుంటోంది. నటనకు అవకాశం వున్న చక్కటి పాత్రలు పోషించాలని అనుకుంటున్న తనకు ఐటెం సాంగ్స్‌ చేయాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని కాజల్‌ వశిష్ట్‌ స్పష్టంచేస్తోంది. ఇక 'దేశముదురు' తర్వాత అర్జున్‌, పూరీల కలయికలో రూపొందుతున్న చిత్రమిది. తన చిత్రాలకు కాస్త భిన్నంగా ఉండేలా పూరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూరుస్తుండగా, అమోల్‌రాథోడ్‌ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు

One Lakh Hugs To All You Lovely People

Sending out one lakh hugs to all.png

లక్షమందికి కౌగిలింతలు ఇచ్చింది 
 
సినీ ముద్దుగుమ్మలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అకౌంట్ ఓపెన్ చేయగానే ఫాలోవర్లు కుప్పలు కుప్పులుగా వచ్చి చేరుతారు. అయితే వారు ఆమె పై ఉన్న అభిమానంతో చేరుతారా లేక టైంపాస్ కి చేరుతారా అన్న విషయం ప్రక్కన పెడితే... తాజాగా ‘ఆరెంజ్ ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన షాజన్ పదాంసీ ఈ మధ్యనే ట్విట్లర్లో ఖాతా తెరిచింది. ఖాతా తెరిచిన కొద్ది రోజులకే ఈమెకు లక్షమంది ఫాలోవర్లు వచ్చి చేరారరట. దీంతో ఈ అమ్మడు తెగ సంబరపడిపోయి ట్విట్లర్లో నన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య అప్పుడే అక్ష దాటేసింది. భలే థ్రిల్లింగ్ గా ఉంది. నా అభిమానులు ఒక్కొక్కరికీ ఒక్కో కౌగిలింత చొప్పున లక్ష కమ్మని కౌగిలింతలు ఇస్తున్నా  అంటూ ట్వీట్ చేసింది. ఈమె కౌగిలింతల్లో ఆ లక్షమంది తడిసిపోయారట. ఇలా కౌగిలింతలు ఇస్తే మరో లక్షమంది చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ జనాలు.

Tuesday, 16 April 2013

Actress Hansika Lip Kiss To Fan

hansika-lip-kiss.gif

  హన్సిక క్రేజ్ కు జపాన్ లో పడిపోయిన అభిమాని? 
 
హన్సిక కు  అభిమానులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కోలీవుడ్ లో హన్సికకు గుడి కట్టే రెంజ్ కు ఎదిగిపోయిన విషయం తెలిసిందే. ఈ తెల్ల పిల్లకు అభిమానులు అట్టహాసంగా పెరిగిపోవటంతో  హన్సిక కు ఆనందం ఎక్కువైంది. ఇటీవల జపాన్ కు వెళ్లిన ఆమెకు ఒక అభిమాని పెద్ద షాకిచ్చారు. జపాన్‌లో హన్సిక కూడా ఓ వీరాభిమాని ఉన్నాడు. ప్రస్తుతం ఆమె తీయ వేలై సెయ్యుమ్ కుమారుఅనే చిత్రం షూటింగ్ కోసం అక్కడికి వెళ్లారు. షూటింగ్ స్పాట్‌కి ఓ వ్యక్తి వచ్చి, హన్సికను కలిశాడు. నేను మీ అభిమానిఅనడంతో జపాన్‌లో తనను అభిమానించే వారున్నందుకు ఆశ్చర్యానందాలకు గురయ్యారు హన్సిక. ఆ ఆనందం నుంచి తేరుకునే లోపు హన్సిక నటించిన సినిమాల డీవీడీల కలెక్షన్ తన దగ్గరుందని చెప్పడంతోపాటు, వాటిని చూపించాడా అభిమాని.  అయితే  ఆ సమయంలో  హన్సిక  ఆ అభిమానికి తీపి గుర్తుగా ఏదైన ఇవ్వాలనే ఉద్దేశం రావటంతో.. వెంటనే ఆమె మనసులో ఒక కోరిక కలిగిందట. హీరోలకు  లిప్ కిస్ లు పెడుతున్నం కదా .. ఇలాంటి అభిమానికి ఒక లిప్ కిస్ పెడితే .. మంచి గ్రిఫ్ట్ గా ఉంటుందని భావించి వెంటనే  అభిమాని దగ్గరకు వెళ్లి లిప్ కిస్ ఇవ్వటానికి  రెఢీ అయింది. 

అయితే షూటింగ్ నిమిత్తం అందరు అక్కడే ఉండటంతో  హన్సిక తనలోని హాట్ కోరికను బయటపడకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం.  అంటే అప్పటికే  హన్సిక తన అభిమాని ముఖాన్ని రెండు చేతులతో దగ్గరకు తీసుకొని.. లిప్ కిస్ పెట్టబోయో సమయంలో వెనకడుగు వేసింది. అంటే హన్సిక అలా చేస్తుందని  షూటింగ్ లో ఉన్న ఎవరు ఉహించలేదు. కానీ అభిమాని మాత్రం అద్రుష్టం దేవత కరుణించి ఇలా వచ్చి ...అలా మిస్సైపోవటంతో చాలా ఫీలయ్యాడని షూటింగ్ సభ్యులు చెబుతున్నారు.  

అయితే చివరిగా అభిమానితో  హన్సిక.. నీకోరిక తప్పకుండా తీర్చుతానని చేతిలో చెయ్యిపెట్టి చెప్పటంతో  అభిమాని ఆనందంగా తిరిగి వెళ్లినట్లు కోలీవుడ్ సమాచారం. ఈవిషయం తెలుసుకున్న హన్సిక అభిమానులు .. చెన్నైలోని  ఆమె ఇంటి ముందు క్యూ కట్టినట్లు కోలీవుడ్ సమాచారం. అభిమానులు ప్రతి రోజు రావటంతో.. మీడియా వారిపై కన్నేసి.. అసలు విషయం రాబట్టింది. ఈ సారీ హన్సిక ఏ అభిమానికి లిప్ కిస్ ఇస్తుందోనని అభిమానులు ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్లుతున్నారట. కొంతమంది అయితే  ఉద్యోగానికి సెలవు పెట్టి, లంచ్ బాక్స్ లు తెచ్చుకొని  అక్కడే భోజనం చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఈసారీ హన్సిక లిఫ్ కిస్ లతో కాకుండా .. ఓన్లీ....హాగ్గులతో ఆనందపరుస్తుందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

Puri Jagannath Chance To Tamanna

puri jagannath chance to tamanna.png

  తమన్నాకి న్యాయం చేస్తానంటున్న పూరీ 
 
మిల్కీ బ్యూటీ తమన్నాకి బాలీవుడ్ లో మరో అవకాశం దక్కిందా ? ఇప్పటికే తన డెబ్యూట్ మూవీ ‘హిమ్మత్ వాలా ’ సినిమా అట్టర్ ప్లాప్ అయిన తరువాత తమన్నా బాలీవుడ్ లో చాప చుట్టేసినట్లే అని అందరు అనుకున్నారు. టాలీవుడ్ లో మంచి ఫాం లో ఉండగా అక్కడికి వెళ్లి పెద్ద తప్పు చేసిందని కామెంట్లు కూడా వినిపించాయి. కానీ మన టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ మాత్రం తమన్నా ఆ సినిమాను ఎంచుకొని ఏ తప్పు చేయలేదు. ఆ పాత్రకు తమన్నా కన్నా ఏ కథానాయిక కూడా ఎక్కువ న్యాయం చేయలేదు. 

ఆ సినిమా పరాజయంలో తమన్నా పాత్ర ఏ మాత్రం లేదని అంటున్నాడు. అంతే కాకుండా తాను తీయబోయే హిందీ సినిమాలో కూడా తమన్నాకు అవకాశం ఇస్తానని అంటున్నాడు. ఈయన త్వరలో హిందీలో రెండు సినిమాలు తీయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో తమన్నానే ప్రధాన కథానాయికగా తీసుకోబోతున్నాడట. మరి తమన్నా పై పూరీ ఇంత ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏమిటో ? మరి తమన్నా కూడా పూరీకి ఏ న్యాయం చేసిందో ?

Anjali To Team Up With Pawan Kalyan

Anjali got a bumper chance.png
 

అంజలికి బంపర్ ఆఫర్ 
 
తెలుగు ప్రేక్షకులకు సీతమ్మగా సుపరిచితం అయిన నటి అంజలి గత వారం రోజుల నుండి నిత్యం వార్తల్లో నిలుస్తూ హల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ కథ సుఖాంతం అయినట్లే. ఈ రోజు నుండి షూటింగులో పాల్గొంటానని చెప్పిన అంజలికి ఇక పై సినిమా అవకాశాలు రావడం కష్టమే అనుకున్నారు అంతా. 



కానీ ఈ కష్టకాలంలో అంజలికి అండగా నిలిచాడు పవన్ కళ్యాణ్. అదేనండీ ఆయన సినిమాలో ఈయనకు అవకాశం ఇచ్చాడని సమాచారం. త్వరలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ ’ సినిమాకు సీక్వెల్ తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మొదట కాజల్ కన్ ఫార్మ్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ చివరికి అంజలిని తీసుకున్నారని దీనికి సంబందించిన అధికారిక సమాచారం త్వరలో వెలువనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు.

Re Entry Into Film Industry By Genelia

Re- Entry Into Film Industry By Genelia.png
 
జెనీలియా మళ్ళీ వస్తానంటుంది 
 
కొందరు సినిమా హీరోయిన్లకు పెళ్ళి చేసుకున్నా సినిమా మీద ఉన్న వ్యామోహం తగ్గదు. ఈ రంగురంగుల ప్రపంచానికి అలవాటు పడ్డతరువాత అంత ఈజీ ఇండస్ట్రీని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. పోయిన సంవత్సరం పెళ్ళి చేసుకొని సంపార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ముంబయి భామ జెనీలియాకు కూడా సినిమాల పై మనస్సు చావలేదు. దీంతో ఆమె మళ్ళీ సినిమాల్లోకి వస్తానంటోంది. ఇటీవల ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆమె మాట్లాడుతూ... 

సంసార జీవితాన్ని అనుభవిస్తున్న ఏదో తెలియని లోటు ఉంది. అదే సినిమాల్లో నటించడంలేదనే బాధ. అందుకే మళ్ళీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. తాను సినిమాలను వదిలేయలేదని, ‘మా ఆయన నాకు పూర్తి స్వేచ్చనిచ్చాడు. నా మీద ఎటువంటి ఆంక్షలు లేవు. కావాలనే సంవత్సరం పాటు నటనకు విరామం ఇచ్చాను. మళ్ళీ తెరమీదకు త్వరలోనే వస్తాను. ఇప్పుడు అదే పనిలో వున్నాను. కథలు వింటున్నాను. మంచి కథ దొరకగానే మళ్ళీ ముఖానికి రంగేసుకుంటాను" అంటోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ అమ్మడుకు ఏ మాత్రం అవకాశాలు వస్తాయో చూడాలి.

Heroine Regina Boyfriends In Movie Industry






కుర్రహీరోయిన్ కు పెరిగిన బాయ్ ఫ్రెండ్స్ ?


డ్యుయల్ సిమ్ నడుస్తున్న టైమ్. పరిచయం పెరుగుతున్న కొద్ది.. సిగ్నల్స్ అందవు? ఈ డ్యుయల్ సిమ్ ఫ్లాన్  అబ్బాయిలకంటే.. అమ్మాయిలకే బాగా ఉపయోగపడుతుందని ఒక సర్వేలో తేలింది. డ్యుయల్ సిమ్ టచ్ స్ర్కిన్ తో మొబైల్స్ మార్కెట్లో మెరిసిపోతున్నాయి. అలాగే అమ్మాయిలు కూడా మార్కెట్లో టచ్ స్ర్కిన్ తో డ్యుయల్ సిమ్ మాదిరిగా మారిపోయారు ఈరోజల్లో అమ్మాయిలు.  అబ్బాయిలు మాత్రం బస్టాంప్ లో కూర్చోని  ఎదురు చూసే రోజులు పోయాయి. రీసెంట్ టాలీవుడ్ లో అడుగుపెట్టిన కుర్ర హీరోయిన్ కు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ పెరిగిపోయారట.  బాయ్ ఫ్రెండ్స్ అంటే  ఆ.. బాయ్ ప్రెండ్స్ కాదులేండి?  వీరు చాలా మంచి బాయ్ ప్రెండ్స్ అని చెబుతుంది రోటిన్ లవ్ స్టోరిచిన్నది రెజీనా?  టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసిన వెంటనే కోలీవుడ్ లో అడుగుపెట్టి  మంచిపేరు దక్కించుకుంది. అక్కడ ఇక్కడ కలిపి రెజీనాకు ఒక  రేంజ్ లో అభిమానులు పెరిగిపోయారు. అయితే ఇప్పటి వరకు  టచ్ స్ర్కిన్ ప్రేమలో పడలేదని, అలాంటి బాయ్ ఫ్రెండ్ దొరకలేదని చెబుతుంది. ఎప్పుడు, ఎవరిపై ప్రేమ పుడుతుందో కూడా తెలియదు. ఎవరినైనా ఇష్టపడితే తప్పకుండా చెబుతా అంటోంది రెజీనా. అలాగే పెళ్లి గురించి చెప్తూ.. ప్రస్తుతం నాకు 22 ఏళ్లు. నా తల్లిదండ్రులు ప్రేమవివాహం చేసుకున్నారు. నేను ప్రేమిస్తున్నానని ఇంట్లో చెబితే తప్పకుండా పెళ్లి చేస్తారు. 
ఆ నమ్మకం నాకుంది అంది.  అయితే ఈ కిలాడి పిల్ల భలే చెబుతుంది. త్వరలో  ఎన్టీఆర్‌ సరసన నటించే అవకాశం చేజిక్కించుకున్నట్లు టాలీవుడ్ సమాచారం.. రీసెంట్ గా వరసగా తెలుగు సినిమాలు కమిటవుతోందనే విషయం గురించి చెప్తూ....  ఆ భాష, ఈ భాష అని విడగొట్టి మాట్లాడటం నాకిష్టం లేదు. ఏ భాష చిత్రమైనా మంచి పాత్ర ఉంటే తప్పక నటిస్తానని చెబుతుంది. అయితే  గ్లామర్‌గా నటించే విషయం గురించి చెప్తూ... నేను నటించిన రెండు సినిమాల్లోనూ గ్లామర్‌ పాత్ర పోషించలేదు. అయినా ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది. మంచినటి అని గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం. అందాలు ఆరబోస్తేనే జనం ఆదరిస్తారనుకోవడం సరి కాదు. అయినా నేను ఎవర్నీ రోల్‌మాడల్‌గా పెట్టుకోలేదు. నేను నాలా నటించాలని అనుకుంటున్నాను. చివరి వరకు రెజీనాలానే ఉండాలనుకుంటున్నని చెబుతుంది.  

 రెజీనా చెబుతున్న మాటలు వింటుంటే  కొత్త బంగారు లోకం సినిమా లో నటించిన హీరోయిన్ గుర్తుకు వస్తుంది.  ఆ హీరోయిన్ కూడా  ఇదే రేంజ్ లో చెప్పినట్లు సమాచారం. అయితే  ఆమె మొదట్లో  బాయ్ ఫ్రెండ్స్ చాలా మంది పెరిగిపోయారు.  ఆ హీరోయిన్ ను అందరు టచ్ స్ర్కిన్ మాదిరే చూసుకున్నట్లు అప్పట్లో పుకార్లు వచ్చాయి.  ఇప్పుడు ఆ హీరోయిన్ స్కిన్ భారీగా పెరిగిపోయి ఐటమ్ సాంగ్స్ లతో, స్టేజీ షోలతో సరిపెట్టుకొని కాలం గడుపుతుంది.  బాయ్ ఫ్రెండ్స్ పెరిగితే. ఆ బాధలు ఎక్కువుగా ఉంటాయాని సీనియర్ నటీమణులు చెబుతున్నారు. రెజీనా  బాయ్ ఫ్రెండ్స్ జర జాగ్రత్తగా ఉండమని అభిమానులు చెబుతున్నారు.